Share News

వేటు పడింది

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:41 PM

జిల్లా బాలల సంరక్షణ విభా గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ‘ఆం ధ్రజ్యోతి’ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తూ కథనా లు ప్రచురితం చేసింది.

 వేటు పడింది

- డీసీపీవోకు వార్న్‌డ్‌ మెమో జారీ

- అవుట్‌రిచ్‌ వర్కర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగింపు

- సీడబ్ల్యూసీ కమిటీపై క్రమశిక్షణ చర్యలకు సెక్రటరీకి సిఫారసు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా బాలల సంరక్షణ విభా గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ‘ఆం ధ్రజ్యోతి’ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తూ కథనా లు ప్రచురితం చేసింది. జూలై 4న ‘‘సంరక్షణ మాటున భక్షణ’’, సెప్టెంబరు 20న ‘‘చర్యలకు వె నుకడుగు’’ అన్న కథనాలు ప్రచురితమయ్యా యి. వీటిపై స్పందించిన కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా పలువురిపై వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సీడీపీవోకు వార్న్‌డ్‌ మె మో ఇస్తూ, అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్‌ రి చ్‌ వర్కర్‌ను విధుల్లోంచి తొలగించారు. దీంతో పాటు సీడబ్ల్యూసీ కమిటీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సెక్రటరీకి సిఫారసు లేఖ రాశారు. సీడబ్ల్యూసీలో అక్రమాలపై విచారణలో వాస్తవాలు అని తేలడంతో కలె క్టర్‌ పలువురిపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీలో పనిచేసే అవుట్‌రిచ్‌ వర్కర్‌ ను ఉద్యోగంలో నుంచి పూర్తిగా తొలగించారు. అంతేకాకుండా ఈ వ్యవహారాలన్నింటిలో డీసీపీ వోను బాధ్యులను చేస్తూ ఆమెపై వార్న్‌డ్‌ మెమో ను జారీ చేశారు. ఇలాంటి అక్రమాలు పునరావృ తం అయితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తూ ఆ మెమోలో పేర్కొన్నారు. అక్రమా లు కొనసాగకుండా పాత సీడబ్ల్యూసీ కమిటీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి సిఫారసు లేఖ రాశారు. ఆ కార్యదర్శి తీసుకునే చర్యలపై ఈ క మిటీ ఉంటుందా... ఊడుతుందో తెలుస్తుంది.

అక్రమాలను వెలికితీసిన ‘ఆంధ్రజ్యోతి’..

జిల్లా బాలల సంరక్షణ కమిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తె చ్చింది. బాధితులతో డబ్బులు తీసుకొని ఫేక్‌ ఏజ్‌ సర్టిఫికెట్‌లు జారీ చేయిస్తున్నారు. అంతేకాకుండా మైనర్‌ పెళ్లిళ్లను ఆపినట్లు ఆపి బాధితులతో డ బ్బులు తీసుకొని వారిపై పోక్సో కేసులు నమోదు చేయించకుండా తిరిగి వారికే అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని అందులో పనిచేసే అవు ట్‌రిచ్‌ వర్కర్‌, దీనికి సహకరించే ది డీసీపీవో అని ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచురించింది. దీనిపై కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా తీవ్రంగా స్పందించారు. వెంటనే అడిషనల్‌ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారు. ఆయన చేసిన విచారణలో ఈ అక్రమాలన్నీ వా స్తవాలేనని తేలాయి. దీంతో అడిషనల్‌ కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దీనిపై కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:41 PM