గట్టు బ్లాక్ సమగ్ర అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:25 PM
గట్టు బ్లాక్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
- 95 శాతానికి పైగా ఫలితాల సాధనే లక్ష్యం
- విశాఖలో జరిగిన నీతి ఆయోగ్ సెమినార్‌లో జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల న్యూటౌన్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : గట్టు బ్లాక్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టంలోని ఏ వన్ గ్రాండ్ కన్వెన్షన్ హాలులో రీజినల్ బెస్ట్ ప్రాక్టీస్ సెమినార్‌ను నిర్వహించారు. ఈ సెమినార్‌లో జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంకు ఎంపికైన గట్టు మండలంలో విద్యారంగంలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడారు. గట్టు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండేదని తెలిపారు. విద్యాప్రమాణాల లోపం వంటి సవాళ్లను జిల్లా పరిపాలన యంత్రాంగం గుర్తించి వాటిని అధిగమించేందుకు సమన్వయంతో ప్రత్యేక కార్యా చరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న పలు వినూత్న కార్యక్రమాలను వివరించారు. అందులో భా గంగా విద్యావాలంటీర్ల నియామకం, సా యంత్రం ప్రత్యేక తరగతులు, విద్యార్ధుల కోసం ప్రేరణాత్మక, అవగాహన కార్యక్రమా లు, తల్లిదండ్రులతో నిరంతర సమన్వయ సమావేశాలు, బడి మానేసిన విద్యార్ధులను తిరిగి చేర్చేందుకు ప్రత్యేక బృందాల ఏర్పా టు, అలాగే విద్యార్థుల్లో పోషకాహార లో పాన్ని అధికమించేందుకు మధ్యా హ్న భోజనంతో పాటు ఉదయం కూడా పోషకాహారం అందించడం వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ చర్యల ఫలితంగా గట్టు మండలంలో ప్రభు త్వ పాఠశాలలో విద్యార్ధుల హాజరు శాతం పెరగడమే కాకుండా పరీక్షలలో మంచి ఫలితాలను సాధించినట్లు చెప్పారు. గట్టు మండలంలో రెండేళ్ల కిందట పదవ తరగతి పరీక్షల ఫలితాలు 76 శాతం ఉండగా ప్రస్తు తం 10 శాతం ఫలితాలు అదనంగా సాధి స్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో 95 శాతానికి పైగా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అనంతరం నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ మాట్లాడుతూ గట్టు బ్లాక్‌ను ఉన్న తంగా తీర్చిదిద్దడానికి జోగుళాంబ గద్వాల జిల్లా పరిపాలనా యం త్రాంగం తీసుకుంటున్న సమగ్ర చర్యలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ కటియార్, ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అనంత్ శేఖర్ తదితరులు ఉన్నారు.