నేటితో పదేళ్లు..
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:50 PM
ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ తెలంగాణ ఏర్పాటు తరువాత జిల్లాల విభజనతో తన స్వరూపం మార్చుకుంది.
జిల్లాల విభజనతో పాలమూరు కొత్త స్వరూపం
- ఐదు జిల్లాలుగా రూపాంతరం
- చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం
- జోగుళాంబ జోన్ ఏర్పాటు
- విభజన ఇబ్బందులతో పలు మండలాలు, గ్రామాల ప్రజలకు ఇక్కట్లు
- నిర్వీర్యమైన జిల్లా పరిషత్
ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ తెలంగాణ ఏర్పాటు తరువాత జిల్లాల విభజనతో తన స్వరూపం మార్చుకుంది. సరిగ్గా పదేళ్ల క్రితం కేసీఆర్ సర్కార్ అక్టోబరు 11న కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాను ముందుగా నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆ తరువాత నారాయణపేట జిల్లా ఏర్పాటుతో ఐదు జిల్లాలుగా మారింది. షాద్‌నగర్‌ను రంగారెడ్డి జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాలు వికారాబాద్‌లో కలిశాయి. వికారాబాద్ జిల్లాలోని గండీడ్ మండలాన్ని పాలమూరులో కలిపారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జిల్లాల ఏర్పాటుతో స్వరూపం మారిపోయింది.
- మహబూబ్‌నగర్, (ఆంధ్రజ్యోతి)
మూడు నియోజకవర్గాలతో 2016లో మహ బూబ్‌నగర్ కొత్త జిల్లా ఏర్పాటు అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం ఏర్ప డింది. ఉమ్మడి పాలమూరు జిల్లా 64 మండలా లతో ఉండగా కొత్త మహబూబ్‌నగర్ జిల్లా 16 మండలాలతో కొలువుదీరింది. చిన్నజిల్లా కావ డంతో అధికార యంత్రాంగానికి పాలనపై పట్టు పెరిగింది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించేందుకు మార్గం సుగమమైంది. జిల్లాల ఏర్పాటు అనంతరం కొత్త మండలాలు కూడా ఏర్పాటయ్యాయి. మహబూ బ్‌నగర్ జిల్లాలో మూసాపేట, రాజాపూర్, కౌ కుంట్ల, మహబూబ్‌నగర్ అర్బన్ మండలాలు ఏ ర్పాటయ్యాయి. దీనివల్ల పోలీస్, రెవెన్యూ ఉద్యో గుల సంఖ్య పెరిగింది. రహదారుల వ్యవస్థ మె రుగుపడింది. కొత్త కలెక్టరేట్‌లు ఏర్పాటయ్యాయి. పాలమూరు శివారు ప్రాంతంలో 25 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ఏర్పాటుచేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట కొలు వుదీరేలా చేశారు. ప్రజలకు కలెక్టరేట్ వెళితే అ న్ని కార్యాలయాలను సందర్శించే అవకాశం క ల్పించారు. కలెక్టరేట్ పాత భవనం స్థానంలో 1000 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రి ప్రా రంభమైతే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి పా లమూరు ఐదు జిల్లాలను కలిపి పోలీస్‌శాఖ జో గుళాంబ జోన్‌ను ఏర్పాటు చేసింది. ఇదివరకు హైదరాబాద్ కేంద్రంగా డీఐజీ కార్యాలయం ఉం డగా ఇప్పుడు మహబూబ్‌నగర్ కేంద్రంగా జోగు ళాంబ జోన్‌ను ఏర్పాటుచేసి డీఐజీని నియమిం చారు. ప్రజలు నేరుగా ఉన్నతాధికారులను కలి సి తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం కలిగింది. అధికారుల పరిధి తగ్గడం వల్ల ప్రజల సమస్యలపై దృష్టి పెట్టేందుకు అవకాశం లభించింది.
కళ తప్పిన జిల్లా పరిషత్..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌గా ఉన్నపుడు జిల్లా పరిషత్ కళకళలాడేది. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగితే 14 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు, 64 మంది జడ్పీటీసీ, ఎంపీపీ, అధికారులతో మీటింగ్ నిండుగా కని పించేది. ఎన్నో సమస్యలకు జిల్లా పరిషత్ వేదిక గా ఉండేది. మీటింగ్ అంటే రణరంగాన్ని తల పించేలా చర్చలు రోజంతా వాడీవేడిగా జరిగేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా పరిషత్ నిర్వీర్యం అయింది. అసలు మీటింగ్‌లే నిర్వహించడం మానేశారు. నిధులు, విధులు లేక జిల్లా పరిషత్ కాలగర్భంలో కలిసిపోయింది. ఇక ఉమ్మడి జి ల్లాలో డీఆర్‌సీ, విజిలెన్స్ మానిటరింగ్ మీటింగ్ లు వాడీవేడిగా జరిగేవి ఇప్పుడు అవన్నీ గత చ రిత్రగా మిగిలిపోయాయి. అసలు నాయకులు జి ల్లాకు సంబంధించిన మీటింగ్‌ల నిర్వహణనే చే యడం లేదు.
నియోజకవర్గం ఇక్కడ.. జిల్లా అక్కడ..
జిల్లాల విభజనతో కొన్ని లోపాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మొత్తం ఒకే జిల్లాకు ఉంటే బాగుండేది. అలాకాకుండా ప లు మండలాలను జిల్లా ఒక చోట, నియోజక వర్గం మరో జిల్లా పరిధిలో ఉంచడం వల్ల ఆ యా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోయిలకొండ మండలం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉంటే ని యోజకవర్గం నారాయణపేటగా ఉంది. గండీ డ్, మహమ్మదాబాద్ మండలాలు మహబూ బ్‌నగర్ జిల్లాలు కలుపగా నియోజకవర్గం ప రిగి వికారాబాద్ జిల్లాకు ఉంది. జడ్చర్ల ని యోజకవర్గం ఊర్కొండ మండలం నాగర్‌క ర్నూల్ జిల్లాకు కలిపారు. దేవరకద్ర నియోజ కవర్గం కొత్తకోట, మదనాపూర్ మండలాలు వనపర్తి జిల్లాకు ఉండగా, ఈ మండలాలు మాత్రం పాలమూరు జిల్లా దేవరకద్ర నియో జకవర్గ పరిధిలో ఉన్నాయి. మండలాలే కాక కొన్ని మండలాలకు చెందిన గ్రామాలు కూ డా ఇలా రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.