Share News

తీన్మార్‌ మల్లన్నవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:24 PM

బీసీల ముసుగులో తీన్మార్‌ మల్లన్న చేస్తున్నదంతా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయమేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.

తీన్మార్‌ మల్లన్నవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

  • డీకే అరుణను విమర్శించే స్థాయి లేదు

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గద్వాల టౌన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బీసీల ముసుగులో తీన్మార్‌ మల్లన్న చేస్తున్నదంతా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయమేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. పార్టీ ఫిరాయింపులపై మల్లన్న చెప్పే మాటలు దయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం పట్టణంలోని డీకే బంగ్లాలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఎక్బోటే, పట్టణ అ ధ్యక్షురాలు రజక జయశ్రీతో కలిసి రామాంజనేయులు విలేకరులతో మాట్లాడారు. గతంలో గ ద్వాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఓసీలకు అవకాశం ఉన్నా బీసీలకు అవకాశం కల్పించిన ఘనత డీకే అరుణదేనన్నారు. రాజకీయంగా బీసీలకు అనేక అవకాశాలు, ప్రాధాన్యతలను కల్పించి ప్రోత్సహిస్తున్న డీకే అరుణను విమర్శించే స్థాయి తీన్మార్‌ మల్లన్నకు లేదన్నారు. బోధ న్‌లో బీసీలైన గౌడ కులస్తులను భయపెట్టి డబ్బులు వసూలు చేసిన మల్లన్న టీంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని మరచిపోరాదన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మల్లన్న బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుటిలయత్నాలను విజయ్‌కు మార్‌ యాదవ్‌ వంటి నాయకులు బహిరంగం గానే విమర్శలు చేసిన విషయం ప్రజలు మరు వలేదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లను బ్లాక్‌ మెయిన్‌ చేసి రూ.30లక్షలు డిమాండ్‌ చేసిన విషయంలో చిలకలగూడ పోలీసులు వేసిన కేసు ద్వారా చంచల్‌గూడ జైలుకు వెళ్లిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. బీసీలను అడ్డం పెట్టుకుని ఊసర వెల్లిలా తానే పార్టీలు మారుతూ పూటకు ఒక వేషం వేస్తూ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయడం ద్వారా ప్రజానాయకులు కాలేమన్న విషయం మల్లన్న గుర్తుంచుకోవాలన్నారు. బీసీలకు తాను ఎలాంటి మేలు చేశారో బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌, కిష్టన్న, రజక నరసింహ, అనిల్‌ ఉన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:25 PM