Share News

పాలమూరుకు కన్నీళ్లు నల్లగొండకు సాగునీళ్లా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:09 PM

డిండి ఎత్తిపోతల కాల్వతో పాలమూరుకు కన్నీళ్లు.. నల్లగొండకుసాగునీళ్లా అని పాలమూ రు జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 పాలమూరుకు కన్నీళ్లు  నల్లగొండకు సాగునీళ్లా?
ఉల్పర వద్ద డీఎల్‌ఐ కాల్వను పరిశీలిస్తున్న జేఏసీ నాయకులు

- పాలమూరు తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి

వంగూరు/చారకొండ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల కాల్వతో పాలమూరుకు కన్నీళ్లు.. నల్లగొండకుసాగునీళ్లా అని పాలమూ రు జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయనతో పాటు ఉమ్మడి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రా ఘవాచారితో కలిసి వంగూరు మండలంలోని డీఎల్‌ఐ కాల్వను పరిశీ లించారు. ఈ సందర్భంగా పోతారెడ్డిపల్లి, ఉల్పర, డిండిచింతపల్లి, ఉ మ్మాపూర్‌, సర్వారెడ్డిపల్లిలో డీఎల్‌ఐ కాల్వ ద్వారా నష్టపో యిన రైతుల ను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఓ వైపు జీవనాధారమైన సాగు భూ ములు కోల్పోయి మరో వైపు సరైన పరిహారం అందక రైతులు తీవ్రం గా నష్టపోయారన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం ఉ ల్పర బ్యారెజ్‌ నుంచి నల్లగొండ జిల్లా శివన్నగూడెం జలాశయం వరకు 66 కిలో మీటర్ల ప్రధాన కాల్వ సహ 9 జలాశయాలను నిర్మిస్తున్నారని, దీంతో నల్లగొండ జిల్లాకు పెద్ద మొత్తంలో సాగునీటిని తీసుకెళ్తూ పాల మూరుకు తీవ్రంగా నష్టం జరుగుతుంద న్నారు. జేఏసీ నాయకులు బ్ర హ్మచారి, సదానందం, వెంకట్‌ గౌడ్‌, మంద రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం

డిండి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర న ష్టం జరు గుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవచారి అ న్నారు. మండలంలోని గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్‌లో ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురి చేయొద్దన్నారు. ఎర్రవల్లిలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వాసితులు సేవ్‌ ఎర్రవల్లి పేరు తో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 131వ రోజుకు చేరాయి. దీ క్షలను వారు సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అధ్యయన వేది న జిల్లా కన్వీనర్‌ న్యాయవాది గుండె వెంకట్‌గౌడ్‌, న్యాయవాదులు వీరబ్రహ్మచారి, మధుసూదన్‌బాబు, పరమేశ్‌గౌడ్‌, కేసీ వెంకటేశ్వర్లు, తి మ్మప్ప, హనీఫ్‌ అహ్మద్‌, ఖలీల్‌, రిటైడ్‌ తహసీల్దార్‌ చెన్నకిష్టయ్య, సా యిబాబా, కల్వకుర్తి జేఏసీ చైర్మన్‌ సదానందంగౌడ్‌, రాజేందర్‌రెడ్డి, పా లమూరు అధ్యయన వేదిక కల్వకుర్తి కన్వీనర్‌ చింతపల్లి ఆశోక్‌గౌడ్‌, రమేశ్‌, క్యామ ఎల్లయ్య, టీజీ శ్రీనివాస్‌, ఆంజనేయులు గౌడ్‌, అల్లాజీ, ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:09 PM