దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:26 PM
దసరా సెలవు ల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
నాగర్‌కర్నూల్ టౌన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : దసరా సెలవు ల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యూటీ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బాలుర జడ్పీహెచ్‌ఎస్ టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమావత్ కృష్ణ అధ్యక్షతన జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ వందలాది మంది ప్ర ధానోపాధ్యాయులు, వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉ న్నాయని, టెట్ ఫలితాలు కూడా వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్త జిల్లాలు, మండలాలు, ఏర్పడి పదేళ్లు గడిచినా డీఈవో, ఎంఈవో పోస్టులు మంజూరు చేయక పోవడం శోచనీయమన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఉ పాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌శర్మ మాట్లాడుతూ.. అక్టోబరు నెలాఖరులోగా మం డలాల మహాసభలు, నవంబరు 21, 22 తేదీల్లో జిల్లా మహాసభలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. చిన్నయ్య, కొర్ర శంకర్, ఎం.ఉమాదేవి, ఆర్.లలితాబాబు, జిల్లా ఉపా ధ్యక్షుడు సి.తిరుపతయ్య, కోశాధికారి జె.బాలరాజు, కార్యకర్శులు నె హ్రూప్రసాద్, పి.మహేష్‌బాబు, కె.రాజాబాయి పాల్గొన్నారు.