Share News

రైతుల శ్రమ, సంస్కృతికి చిహ్నాలు వృషభ రాజాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:23 PM

వ్యవసా యానికి జీవ నాధారమైన వృషభ రాజాలు రైతుల శ్రమకు, సంస్కృ తికి చిహ్నాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.

 రైతుల శ్రమ, సంస్కృతికి చిహ్నాలు వృషభ రాజాలు
బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

- ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెబ్బేరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి); వ్యవసా యానికి జీవ నాధారమైన వృషభ రాజాలు రైతుల శ్రమకు, సంస్కృ తికి చిహ్నాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. మునిసిపాలిటీలోని చెలిమిల్ల, కిష్టారెడ్డి పేటలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవా ల సందర్భంగా ఏర్పాటు చేసిన బండ లాగుడు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. మం గళ వారం న్యూకేటగిరి విభాగం పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ కుటుం బంలో పశువుల పోషణ వాటిని రక్షించడం రై తుల జీవితం లో ముఖ్యమైన భాగమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృషభరాజ బండలాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతాయ న్నారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ప్రమోదిని, విజయవర్ధన్‌ రెడ్డి, జిల్లా బ్లాక్‌ కాంగ్రెస్‌ అఽఽధ్యక్షులు అక్కి శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకట్‌ రాములు యాదవ్‌, రంజీత్‌, దయాకర్‌ రెడ్డి, యుగేందర్‌ రెడ్డి, వెంకటరమణ, జయపాల్‌ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:23 PM