చెరువు కట్ట ధ్వంసం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:26 PM
అనుమతి లేకుండా చెరువు కట్టను.. చెరువు కింద ఆను కొని ఉన్న పొలాన్ని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు చదును చేశారు.
- అడ్డుకున్న గ్రామస్థులు.. చెరువును పరిశీలించిన అధికారులు
భూత్పూర్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : అనుమతి లేకుండా చెరువు కట్టను.. చెరువు కింద ఆను కొని ఉన్న పొలాన్ని రియల్‌ఎస్టేట్ వ్యాపారులు చదును చేశారు. ఎన్నో ఏళ్ల నాటి చెరువును కొల్లగొట్టి వెంచర్ చేస్తున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారు లను గ్రామస్థులు అడ్డు కొని ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు స మాచారం ఇవ్వడంతో స్పందించిన అధికారులు చదును చేస్తున్న యంత్రాలను నిలిపివే శారు. ఈ సంఘటన భూత్పూర్ మునిసిపాలి టీ పరిధిలోని 44వ జా తీయ రహదారికి ఆనుకొని ఉన్న శేరిపల్లి(బీ) గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. మునిసిపాలిటీ పరిధిలోని శేరి పల్లి(బీ) గ్రామ శివారులో కోమటికుంట చెరువు ఉంది. ఈ చెరువుకు ఆనుకొని 44వ జాతీయ రహదారి ఉండడంతో ఇక్కడ భూములకు మం చి డిమాండ్ ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. అయితే చెరువు పట్టా పొలంలో ఉందని దాన్ని ఎలాగైనా చదును చేసి స్వాధీనం చేసుకోవాలని చెరువు తూమును, కట్టను తొలగించారు. విషయం తెలుసుకున్న శేరి పల్లి గ్రామస్థులు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధి కారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన రెవెన్యూ జీపీవో వెంకట్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ కవిత సంఘటన స్థలానికి చేరుకొని చెరువు కట్టా, తూము ప్రాంతాన్ని పరిశీలించి నిలిపివేశారు. సోమవారం జిల్లా స్థాయి అధి కారులు చెరువును పరిశీలించనున్నట్లుగా అధి కారులు తెలిపారు.