భవిష్యత్తు కోసం కన్నీళ్లను దిగమింగి..
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:22 PM
ఓ వైపు కన్న తండ్రి మరణం.. మరో వైపు భవిష్యత్తుకు కీలకమైన 10వ తరగతి పరీ క్షలు.. ఆ విద్యార్థులు బాధనంతా గుండె ల్లో అదిమిపట్టి, కన్నీళ్లను దిగమింగుకొని కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశారు.
- వేర్వేరు చోట్ల అనారోగ్యంతో తండ్రుల మరణం
- 10వ తరగతి పరీక్షకు హాజరైన ముగ్గురు విద్యార్థులు
మానవపాడు/ వంగూరు/ అమర చింత, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు కన్న తండ్రి మరణం.. మరో వైపు భవిష్యత్తుకు కీలకమైన 10వ తరగతి పరీ క్షలు.. ఆ విద్యార్థులు బాధనంతా గుండె ల్లో అదిమిపట్టి, కన్నీళ్లను దిగమింగుకొని కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశారు. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత తండ్రుల అం త్యక్రియల్లో పాల్గొన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా, మానవ పాడు మండలంలోని అమరవాయి గ్రామా నికి చెందిన కరీం (40) అనారోగ్యంతో ఆది వారం రాత్రి మృతి చెందాడు. అతడి కుమా రుడు సమీర్ 10వ తరగతి పరీక్షలు రాస్తు న్నాడు. సోమవారం ఆంగ్లం పరీక్ష ఉండటం తో, కన్నీళ్లను దిగమింగి కేంద్రానికి చేరుకొని పరీక్ష రాశాడు. కుటుంబ సభ్యులు, స్థానికు లు దైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరైనట్లు ఆ విద్యార్థి తెలిపాడు.
నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండ లంలోని ఎల్లికల్లుకు చెందిన శివకృష్ణ, మేన మామ ఊరైన వంగూరు మండలంలోని ఉల్పరలో ఉంటూ, ప్రభుత్వ ఉన్నత పాఠశా లలో 10వ తరగతి చదువుతున్నాడు. బాలు డి తండ్రి ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెండాడు. దీంతో బాలుడు వెంటనే గ్రామానికి చేరుకున్నాడు. విషయం తెలుసు కున్న ప్రధానోపాధ్యాయుడు కొండల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు గణేశ్‌ను ఎల్లికల్‌కు పంపిం చారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ విద్యార్థిని వంగూరులోని కేం ద్రానికి తీసుకెళ్లి పరీక్ష రాయించారు. అనంతరం విద్యార్థి గణేశ్‌ను గ్రామానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతడి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.
వనపర్తి జిల్లా, అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని నంది మల్ల ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన జలంధర్ (46) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. అతడి కుమారుడు సాగర్ అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తు న్నాడు. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖం లో ఉన్న బాలుడిని, కుటుంబ సభ్యులను సర్పంచు భారతి, ఉపసర్పంచు పరిగి భా స్కర్‌లు ఓదార్చారు. బాలుడికి ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.