Share News

సుస్థిర సాగు పద్ధతులు అవలంబించాలి

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:08 PM

సాగు భూ మి సంరక్షణే ధ్యేయంగా చేప ట్టిన కేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం ధన్వాడ మండలం ఎం నోన్‌పల్లి గ్రామ పంచాయతీ లో ప్రత్యేక అవగాహన సద స్సు నిర్వహించారు.

సుస్థిర సాగు పద్ధతులు అవలంబించాలి
ధన్వాడ మండలం ఎంనోన్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో రైతులకు సూచనలు చేస్తున్న డీఏవో సక్రియానాయక్‌

- డీఏవో సక్రియానాయక్‌ 8 యాసంగిలో పప్పుధాన్యాలు సాగు చేయాలి

- వ్యవసాయ పంట పొలాల సంరక్షణపై రైతులకు అవగాహన

ధన్వాడ/కొత్తపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సాగు భూ మి సంరక్షణే ధ్యేయంగా చేప ట్టిన కేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం ధన్వాడ మండలం ఎం నోన్‌పల్లి గ్రామ పంచాయతీ లో ప్రత్యేక అవగాహన సద స్సు నిర్వహించారు. కార్యక్ర మానికి జిల్లా వ్యవసాయ అ ధికారి సక్రియానాయక్‌ హాజ రై రైతులకు పలు సూచనలు చేశారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం, సమగ్ర పోషక సస్యరక్షణ పద్ధతులు, పంట అవశేషాల సమగ్ర నిర్వహణ, నీటి సంరక్షణ తదితర అంశాలపై రై తులకు అవగాహన కల్పించారు. భూసార ఆరో గ్య కార్డుల దినోత్సవం, వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర సాగు పద్ధతులు, పంటల వై విద్యీకరణ అవశ్యకతను ఆయన వివరించారు. అనంతరం పంట మార్పిడి విధానంలో భాగం గా ఎంనోన్‌పల్లి శివారులో సాగు చేసిన పొద్దుతి రుగుడు పంటను, అలాగే గ్రామంలోని వరి పొ లాలను పరిశీలించి రైతులకు సూచనలు, సల హాలు అందించారు. కార్యక్రమంలో ఎంనోన్‌పల్లి గ్రామ సర్పంచు నగేష్‌, ఏవో నవీన్‌కుమార్‌, ఏఈవో శ్వేత, ఉద్యానవన అధికారి లింగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలస్వామి, స్థానిక రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా, కొత్తపల్లి మండలం నందిగామ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించిన ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం లో కోస్గి ఏడీఏ నూతన్‌కుమార్‌ రైతులకు పం టల సాగుపై పలు సూచనలు చేశారు. రాబో యే యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని అధిక నీరు అవసరమయ్యే వరికి బ దులుగా శనగ, పెసర, మినుము వంటి ప ప్పుధాన్యాల పంటలను వేసుకోవాలని సూచిం చారు. పంట అవశేషాలను తగులబెట్టి కేసుల పాలు కావొద్దన్నారు. కార్యక్రమంలో ఏఈవో ప్ర శాంత్‌, సర్పంచ్‌ శారద, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:08 PM