Share News

నగరం చుట్టూ నిఘా

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:06 PM

పాలమూరు కార్పొరేషన్‌ రోజురోజుకూ విస్త రిస్తోంది. నగరం చుట్టూ బైపాస్‌ రహదారి ఏ ర్పాటైంది. వాహనాల రాకపోకలు పెరగడంతో పాటు వాటి వేగం పెరిగింది. ఈ క్రమంలో రో డ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైపోయింది.

నగరం చుట్టూ నిఘా
మహబూబ్‌నగర్‌ పట్టణంలో గల బైపాస్‌ రహదారి

- జడ్చర్ల, భూత్పూర్‌, దేవరకద్ర మునిసిపాలిటీల్లోనూ..

- ముడా నుంచి విడతల వారీగా నిధులు

- రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా బైపాస్‌ రోడ్డు

- మినీ ట్యాంక్‌బండ్‌పై అసాంఘిక చర్యలు

- ఆరునెలల క్రితం పాలమూరు నగరం నడిబొడ్డున ఉన్న ఏటీఎంను యంత్రంతో సహా అంతరాష్ట్ర దొంగల ముఠా ఎత్తుకెళ్లిం ది. దాన్ని ఏ దారిలో, ఎలా తీసుకెళ్లారో ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కలేదు. దొంగల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.

- భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లో ఇటీవల జరిగిన థార్‌ వాహనాల టక్కర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనలో దంపతులు మరణించగా, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తీరు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యో తి): పాలమూరు కార్పొరేషన్‌ రోజురోజుకూ విస్త రిస్తోంది. నగరం చుట్టూ బైపాస్‌ రహదారి ఏ ర్పాటైంది. వాహనాల రాకపోకలు పెరగడంతో పాటు వాటి వేగం పెరిగింది. ఈ క్రమంలో రో డ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైపోయింది. అలాగే నగరంలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌బండ్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు నిందితులను పట్టుకోవడం పోలీసులకు కష్టతరం అవుతోంది. చాలా కేసుల్లో నిందితులు తప్పించుకుంటున్నా రు. ఒకవేళ దొరికినా ప్రమాదం ఎవరి వల్ల జరి గిందో కూడా కొన్నిసార్లు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంటోంది. దీనికి తోడు నగరంలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు కూడా ఆందోళనకు గురిచేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ విస్తృతం గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పో లీసు శాఖ భావిస్తోంది.

ముడా నుంచి రూ. 10 లక్షలు

సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీస్‌ శాఖ ప్రయత్నంతో కొందరు దాతలు ముందుకొస్తున్నా రు. కానీ, పెద్ద మొత్తంలో నిధులు కావాల్సి వ స్తుండటంతో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అఽథారిటీ (ముడా) సహాయం కోరగా వి డతల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఇ ప్పటికే రూ.10 లక్షలు విడుదల చేయగా, నగరం లోని వన్‌టౌన్‌, టుటౌన్‌, రూరల్‌ పరిధిలో కెమె రాలను ఏర్పాటు చేశారు. తాజాగా మరో రూ.20 లక్షలు మంజూరు కావడంతో బెంగళూరుకు చెం దిన కాంట్రాక్టర్‌కు సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్య తలను అప్పగించారు. ప్రస్తుతం వైరింగ్‌ పనులు నడుస్తున్నాయి. అలాగే ముడా నిధులతోనే జడ్చ ర్ల, భూత్పూర్‌, దేవరకద్ర మునిసిపాలిటీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మొత్తం రూ.70 లక్షల వరకు విడతల వారీగా ముడా నుంచి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముడా బడ్జెట్‌ కేటాయిస్తున్నా ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలో పోలీస్‌శాఖ నిర్దేశిస్తోంది. మొత్తం కెమెరాలను ఏర్పాటు చేశాక ఆయా ప్రాంతాల వివరాలను ముడాకు సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎస్‌బీఐ సహకారంతో నగరంలో 50 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో 20 కెమెరాలను మినీట్యాంక్‌బండ్‌పై, 30 కెమెరా లను నగరంలో ఏర్పాటు చేస్తున్నారు.

మినీ ట్యాంక్‌బండ్‌ చుట్టూ...

నగరం నడిబొడ్డునున్న మినీ ట్యాంక్‌బండ్‌ పై నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు తి రుగుతుంటారు. చుట్టూ నాలుగు కిలోమీటర్ల రహదారి ఉన్న ట్యాంక్‌బండ్‌పై 2 కిలోమీటర్ల మేర లైటింగ్‌ ఉండగా, మిగతా ప్రాంతం చీక టిగా ఉంటోంది. రాత్రి వేళ ఆ ప్రాంతం అ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింద న్న ఆరోపణలున్నాయి. మందుబాబులకు కూ డా అడ్డాగా మారిందని తెలుస్తోంది. అందు కోసం చుట్టూ లైటింగ్‌తో పాటు, సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 20 కెమెరాలు ఏర్పాటు చేయగా, మరో 30 కెమెరాలను ఏర్పాటు చేస్తే వాకర్స్‌, సందర్శకులకు భద్రత పెరుగుతుంది. అదే వి ధంగా పిస్తాహౌస్‌ నుంచి కోయిలకొండ ఎక్స్‌ రోడ్‌ వరకు బైపాస్‌ రహదారిపై రోడ్డు ప్రమా దాల నియంత్రణకు, వాహనాల వేగ నియం త్రణకు కూడా కెమెరాలు అవసరం. నగరం లోని అన్ని ప్రధాన రహదారులు, బస్టాండ్‌లో నూ మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Oct 28 , 2026 | 11:06 PM