Share News

హెచ్‌ఐవీ నియంత్రణలో సురక్షిత్‌ జిల్లా గుర్తింపు

ABN , Publish Date - Nov 19 , 2026 | 11:48 PM

హెచ్‌ఐవీ, ఏయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్ధేశిత 95-95-95 లక్ష్యాల సాధనకు చేసిన కృషితో మహబూబ్‌నగర్‌కు సురక్షిత్‌ జిల్లాగా గుర్తింపు లభించడం అభినందనీయమని కలెక్టర్‌ ఖుష్భూగుప్తా పేర్కొన్నారు.

హెచ్‌ఐవీ నియంత్రణలో సురక్షిత్‌ జిల్లా గుర్తింపు
కలెక్టర్‌కు అభినందనలు తెలుపుతున్న వైద్య ఆరోగ్యశాఖ అదికారులు

- అభినందించిన కలెక్టర్‌ ఖుష్భూగుప్తా

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌ఐవీ, ఏయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్ధేశిత 95-95-95 లక్ష్యాల సాధనకు చేసిన కృషితో మహబూబ్‌నగర్‌కు సురక్షిత్‌ జిల్లాగా గుర్తింపు లభించడం అభినందనీయమని కలెక్టర్‌ ఖుష్భూగుప్తా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాసాగర్‌ ఆదేశాల మేరకు గురువారం కలెక్టరేట్‌లో సమ్మాన్‌ సమారోహ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, టీసాక్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మేఖలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సత్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 20 జిల్లాల్లో మహబూబ్‌నగర్‌కు స్థానం దక్కడం వైద్యాధికారుల సమష్టి కృషికి నిదర్శనం అన్నారు. డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాంత్‌, ఏయిడ్స్‌, లెప్రసీ శాఖల జిల్లా అధికారులు డాక్టర్‌ రాజునాయక్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ బీమాపై విసృత ప్రచారం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై విసృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వెబెక్స్‌ నిర్వహించారు. పథకం ప్రాముఖ్యత, లక్ష్యాలు, అర్హులైన కుటుంబాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపల్‌ వార్డుల్లో టాంటాం ద్వారా ప్రచారం చేయడంతో పాటు పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, సీపీవో నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 11:48 PM