Share News

కల్వకుర్తి అభివృద్ధికి సహకారం

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:20 PM

కల్వకుర్తి అభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని రాష్ట్ర ఎక్సై జ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మై నార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ భరోసానిచ్చారు.

  కల్వకుర్తి అభివృద్ధికి సహకారం
కల్వకుర్తి మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఏకశిల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్య్డే, కలెక్టర్‌

- మంత్రులు జూపల్లి, అడ్లూరి భరోసా

- గాంధీజీ విగ్రహావిష్కరణ

కల్వకుర్తి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి అభివృ ద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని రాష్ట్ర ఎక్సై జ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మై నార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ భరోసానిచ్చారు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రతిపాదిస్తున్న అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించి మం జూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అ డ్లూరి స్పష్టం చేశారు. కల్వకుర్తిలో కల్చరల్‌ కమ్యూనిటీ భ వన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. శుక్రవారం గాంధీజీ జయంతిని పురస్కరిం చుకుని కల్వకుర్తి మునిసిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో నూతనం గా ఏర్పాటు చేసిన ఏకశిలా గాంధీ విగ్రహాన్ని ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం ఏర్పాటుకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు మాట్లాడారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల, వైస్‌ చైర్మ న్‌షానవాజ్‌ఖాన్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసింగ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ మనీలా సంజుకుమార్‌యాద వ్‌, మునిసిపల్‌ కమీషనర్‌ మహమ్మద్‌ షేక్‌, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, వాసవీక్లబ్‌ ఇంటర్నే షనల్‌ సర్వీసెస్‌ సెక్రటరీ జూలూరి రమేష్‌బాబు పాల్గొన్నారు.

వార్డు ఆఫీసులతో పౌర సేవలు మరింత చేరువ

ప్రజల సమస్యలు వారి వార్డుల్లోనే పరిష్కరించి పాలనను నే రుగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కల్వకుర్తిలో ఏ ర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు ఆదర్శంగా నిలుస్తాయని మం త్రులు అన్నారు. శుక్రవారం కల్వకుర్తిలో నూతనంగా ఏర్పాటు చే సిన వార్డు కార్యాలయాలను నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాలతో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం మహిళలకు వడ్డీలేని రుణాల కింద మంజూరైన రూ.7.25కోట్ల చె క్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. రైతులకు సబ్సి డీ స్ర్పింక్లర్లను పంపిణీ చేశారు. మునిసిపల్‌ వైస్‌ మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:20 PM