Share News

విద్యార్థులు బడికి గైర్హాజరు కావొద్దు

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:41 PM

విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతీరోజు పాఠ శాలకు హాజరుకావాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు.

విద్యార్థులు బడికి గైర్హాజరు కావొద్దు
గద్వాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థితో మాట్లాడుతున్న కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

  • కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల టౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతీరోజు పాఠ శాలకు హాజరుకావాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారిని పాఠశాలకు రప్పించేలా బాధ్యతలు తీసుకోవాలని హెడ్‌మాస్టర్‌కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దసరా సెలవులు పూర్తయినా విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్‌ వారు సెలవుల్లో ఎలా గడిపారో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థు లందరూ యూనిఫారం ధరించి పాఠశాలకు రావడాన్ని క్రమశిక్షణగా పరిగణించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ దాతల సహకారంతో నిర్మిస్తున్న సమావేశాల వేదిక షెడ్‌ను పరిశీలించారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో గద్వాల ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్‌, తహసీల్దార్‌ హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ అజిత్‌కుమార్‌, హెడ్‌మాస్టర్‌ రేణుకాదేవి ఉన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:41 PM