Share News

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:10 PM

విద్యార్థి దశనుంచే ప్రతీ ఒక్కరు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని ఆ దిశగా చదువుకోవాలని బాలల జీవితాలను తీర్చిదిద్దేది విద్యాలయాలేనని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
బహుమతులు అందుకున్న విద్యార్థులతో కలెక్టర్‌, అధికారులు

  • జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

గద్వాల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశనుంచే ప్రతీ ఒక్కరు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని ఆ దిశగా చదువుకోవాలని బాలల జీవితాలను తీర్చిదిద్దేది విద్యాలయాలేనని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీలో నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు వేడుకలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీ య బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యదశ ఒక అందమైన జ్ఞాపకంగా మిగలాలని ఆకాంక్షించారు. జిల్లాలో గట్టు, కేటీదొడ్డి, మల్దకల్‌ ప్రాంతాలలో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి నియంత్రణకు ప్రతీఒక్కరు తోడ్పడాలని సూచించారు. చిన్నవయస్సులో పెళ్లిళ్లు చేయడంతో శారీరికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. విద్యాసంస్థలలో చైల్డ్‌సేఫ్టీ అధికారులను నియమించడమే కాకుండా దిశ, సఖి కేంద్రాలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఉమెన్‌ సేఫ్టీ విభాగాలు బాలల, మహిళల సంరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. బాలలకు ఏ సమస్య వచ్చినా 1098కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థి దశలో చదువుకు సంబందించిన సాంకేతిక అభివృద్ధిని పెంపొందించుకునేందుకు సెల్‌ ఫోన్‌ వాడాలి కానీ గేమ్స్‌, వీడియోలు, రీల్స్‌ చూడటానికి కాదన్నారు. గుడ్‌ బ్యాడ్‌ టచ్‌లపై చిన్నారులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, అదనపు ఎస్పీ శంకర్‌, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, డీఐఈఓ హృదయరాజ్‌, డీసీపీఓ నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 11:10 PM