విద్యార్థినులు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:11 PM
విద్యార్హతలతో పాటు వృత్తి సంబంధ నైపుణ్యం కోసం ఇచ్చే శిక్షణను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్‌బాషా సూచించారు.
ప్రిన్సిపాల్ షేక్ కలందర్ బాషా
గద్వాల టౌన్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్హతలతో పాటు వృత్తి సంబంధ నైపుణ్యం కోసం ఇచ్చే శిక్షణను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్‌బాషా సూచించారు. తెలంగాణ స్కిల్ నాలెడ్జి సెంటర్, ఉమ్మిదు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ విద్యార్థుల కోసం కేరీర్ రెడినెస్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రిన్సి పాల్, లైఫ్ స్కిల్స్, ఇంటర్య్వూ స్కిల్స్, కమ్యూ నికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంశాలపై అవగా హన పెంచుకుని నచ్చిన రంగాలను ఎంచుకుని లక్ష్యసాధన కోసం కృషి చేయాలన్నారు. రీసోర్స్ పర్సన్ ఈష మాట్లాడుతూ మహిళల కోసం ప్ర త్యేకంగా వృత్తి పరమైన లక్ష్యాలను సాధించేం దుకు వీలుగా వారి కేరీర్ మార్గాలను నావిగేట్ చేసేందుకు శిక్షణ ఉపకరిస్తుందన్నారు. నెల పాటు సాగే సర్టిఫికెట్ కోర్సులను పొందేందుకు విద్యార్థినులు శిక్షణకు హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, టీఎస్‌కేసీ మెంటార్ సుబ్రమణ్యం, అధ్యాపకులు సురేందర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణయ్య, సునీత ఉన్నారు.