విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథం అలవర్చుకోవాలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:04 PM
పాఠ్యాంశాలతో పాటు పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చు కుంటేనే విద్యార్థులు సబ్జెక్టుపై విస్తృత అవగాహన పొందగలరని పాలమూ రు విశ్వవిద్యాలయం కెమిస్ర్టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ అన్నారు.
పీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్
గద్వాల టౌన్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాఠ్యాంశాలతో పాటు పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చు కుంటేనే విద్యార్థులు సబ్జెక్టుపై విస్తృత అవగాహన పొందగలరని పాలమూ రు విశ్వవిద్యాలయం కెమిస్ర్టీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని మహారాణి ఆదిల క్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవా రం ‘ఎలక్ర్టానిక్ స్పెక్టోస్కోపి’ అనే అంశంపై ప్ర త్యేక విస్తృత ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యవక్తగా హాజరైన ప్రదీప్‌కుమార్, నిత్య జీవితంలో ఎలక్ర్టానిక్ స్పెక్టోస్కోపి ప్రాధాన్య తను వివరించారు. పోటీ పరీక్షల్లో కెమిస్ర్టీ అం శాలపై ఎలా పట్టు సాధించాలో దిశానిర్దేశం చే శారు. ఎలక్ర్టానిక్ స్పెక్టోస్కోపిలోని సంక్లిష్టమైన అంశాలను వర్ణపటాల ద్వారా వివరిస్తూ పదా ర్థాలను గుర్తించే విధానాన్ని వివరించారు. కార్య క్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ చంద్రమోహన్, అధ్యాపకులు సత్యన్న, భాస్కర్, వెంకటేషం ఉన్నారు.