Share News

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:41 PM

జిల్లాకేంంద్రంలోని ప్రభుత్వ మార్కెట్‌ లైన్‌ పాఠశాలలో 1986 సంవత్సరపు పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఏర్పా టు చేశారు.

40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు
గురువులతో 1986 ఎస్సెస్సీ బ్యాచ్‌ విద్యార్థులు

నారాయణపేట, మార్చి29 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంంద్రంలోని ప్రభుత్వ మార్కెట్‌ లైన్‌ పాఠశాలలో 1986 సంవత్సరపు పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఏర్పా టు చేశారు. 40 ఏళ్ల తర్వాత స్నేహితులు కలు సుకొని తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోని నేడు వివిధ రంగాలలో కొనసాగుతున్న తమ అనుభ వాలు, ఆనందాన్ని పంచుకున్నారు. తమకు వి ద్యాబోధన చేసిన గురువులు దామరగిద్ద నర్సిం గ్‌రావు, మధుకర్‌రావు ధోత్రేను శాలువాతో స త్కరించారు. స్నేహితులను కలిపేందుకు మాణిక్‌కోర్‌వార్‌ ప్రత్యేక చోరవ తీసుకొని అన్ని తానై వ్యవహరించినట్లు తెలిపారు. పూర్వ వి ద్యార్థులైన మహిళలు గుల్బర్గ, గద్వాల్‌, బెంగ ళూరు, ముంబాయి తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. కార్యక్రమంలో రమేష్‌ బసోదే, శ్యామ్‌ లాహటి, సుభాష్‌ బసోదే, గణేష్‌ సింగాడే, గణేష్‌ దోతే తదితరులున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:41 PM