Share News

సైబర్‌ నేరాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:34 PM

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా సైబర్‌ స్వతంత్ర తెలంగాణ ప్రత్యేక సైబర్‌ అవగాహన ప్రచార కార్యక్ర మాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు.

సైబర్‌ నేరాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర కీలకం
ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్పీ సునీతరెడ్డి, అధికారులు

- ఎస్పీ సునీతరెడ్డి

వనపర్తి విద్యా విభాగం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా సైబర్‌ స్వతంత్ర తెలంగాణ ప్రత్యేక సైబర్‌ అవగాహన ప్రచార కార్యక్ర మాన్ని బుధవారం జిల్లా కేంద్రంలోని స్కాలర్స్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఎస్పీ సునీతరెడ్డి, విద్యార్థులకు సైబర్‌ భద్రతపై అవ గాహన కల్పించారు. అనంతరం ప్రత్యేక సైబర్‌ జాగృతి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధిక లాభాలు వస్తా యని చెప్పే పెట్టుబడి యాప్‌లు, నకిలీ ట్రేడిం గ్‌ వెబ్‌సైట్లు, డిజిటల్‌ అరెస్టు పేరుతో బెది రింపులు, సోషల్‌ మీడియా, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబా బు, సీఐ సుగంధ రత్నం, సైబర్‌ క్రైమ్‌ సీఐ శ్రీను నాయక్‌, కళాశాల విద్యార్థులు, అధ్యాప కులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:34 PM