Share News

విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:14 PM

వాణిజ్యశాస్త్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీ యూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు.

విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి
మాట్లాడుతున్న పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌

- పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌

పాలమూరు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వాణిజ్యశాస్త్ర విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీ యూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పాలమూరు యూని వర్సిటీలోని అకాడమిక్‌ ఆడిటోరియంలో వాణిజ్యశాస్త్రం విభాగం, తెలం గాణ కామర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి కామ ర్స్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఇది ఒక ఫెస్ట్‌ మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కామర్స్‌ విద్యార్థులతో సృజనాత్మకత, విమర్శనాత్మకత ఆలోచన, సహకార స్ఫూర్తి పెంపొందించే వేధికని తెలిపారు. ఏఐ, చాట్‌ జీపీటీ వంటి టెక్నాలజీని ఉపయోగించుకో వాలని, బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్‌ వాటిలో స్థిరపడాలని సూచించారు. అంతకుముందు పీయూ రిజిస్ర్టార్‌ పూస రమేష్‌బాబు మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో వాణిజ్యశాస్త్రం విద్యార్థులు ప్రపంచంతో పోటీప డాలని అన్నారు. వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఫెస్ట్‌లో భాగంగా వ్యాసరచన పోటీలు, బిజినెస్‌ క్విజ్‌ చైనీస్‌ విస్పర్‌, రీల్‌ టు రీయల్‌, అడ్‌ మ్యాడ్‌ షో, జస్ట్‌ ఏ మినిట్‌, గ్రూప్‌ సాంగ్స్‌, డ్యాన్స్‌ వంటి పోటీల లో పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులు ఈ నెల 7న సికిం ద్రాబాద్‌లోని అవినాష్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో రాష్ట్రస్థాయి ఫైనల్స్‌లో యూనివర్సిటీ తరుపున ప్రాతినిథ్యం వహిస్తారని కన్వీనర్లు అనురా ధరెడ్డి, రాజ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, పీజీ ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 11:14 PM