Share News

విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:09 PM

వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్‌ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు.

 విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట కేజీబీవీలో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే మేఘారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- రాష్ట్ర పశు సంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి విద్యా విభాగం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్‌ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్‌ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ హాస్టల్‌ భవనం ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి మర్రికుంటలోని కేజీబీవీ పాఠశాలలో రూ.80 లక్షలతో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. ఎంపీ మల్లు రవి స్వయంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకున్నారని, అందుకే ఆయన సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు ప్రాధాన్యం ఇస్తూ నూతన భవన నిర్మాణానికి సహకరించారన్నారు. ఎంపీ మల్లు రవి విద్యార్థులతో మాట్లాడారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, కౌన్సిలర్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు , ప్రజాప్రతినిదులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 11:09 PM