సాగునీటి కోసం పోరుబాట
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:51 PM
జూరాల ప్రాజెక్టు కాలు వల పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి.. కాలువలకు నీళ్లు వదలాలని రైతులు పోరాటం చేస్తున్నారు. సోమవారం గద్వాల జిల్లాతో పాటు వనపర్తి జిల్లా ఆ త్మకూరు, అమరచింతకు చెందిన రైతులు ఆందోళన ఉ ద్రిక్త వాతావరణానికి దారితీసింది.
- ఐదుగంటల పాటు రోడ్డుపై బైఠాయింపు
- మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు
- ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు
- ఆనకట్టపైకి చేరుకున్న వేలాది మంది రైతులు
గద్వాల/ఆత్మకూరు/అమరచింత/వనపర్తి/జడ్చర్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు కాలు వల పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి.. కాలువలకు నీళ్లు వదలాలని రైతులు పోరాటం చేస్తున్నారు. సోమవారం గద్వాల జిల్లాతో పాటు వనపర్తి జిల్లా ఆ త్మకూరు, అమరచింతకు చెందిన రైతులు ఆందోళన ఉ ద్రిక్త వాతావరణానికి దారితీసింది. వివరాలిలా ఉన్నా యి. గద్వాలలో ఐదు గంటల పాటు ధర్నా చేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మొదట కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని రైతులు, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కలెక్టరేట్ వద్దకు చేరుకున్న రైతులు ధర్నా నిర్వహించారు. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. దాదాపు రెండు కిలోమీటర్లు రోడ్డుపై న డిచి 11:30గంటల ప్రాంతంలో 300మందికి పైగా రైతులు ఇరువైపులా రోడ్లపై కూర్చొన్నారు. వీరికి మద్దతుగా బీజేపీ నేత డీకే స్నిగ్దారెడ్డి, బీఆర్‌ఎస్ నేత మాజీ జడ్పీటీసీ బాసు శ్యామలలు అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు ప్రకటించారు. దీంతో గద్వాల ఫ్లై ఓవర్ వరకు ఎర్రవల్లి వైపు వీరాపురం స్టేజీ వరకు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం అయ్యింది. అదనపు ఎస్సీ శంక ర్ అక్కడికి చేరుకొని నచ్చచెప్పినా రైతులు ససేమిరా అన్నారు. బస్సులు, వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఐ దు అంబులెన్స్‌లకు, అత్యవసరంగా ఆసుపత్రులకు వె ళ్లే వారికి మాత్రం రైతులు దారిచ్చారు. కాగా, అదనపు కలెక్టర్ మధుమోహన్ వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చే యగా మహిళా రైతులు ఆయన కాళ్లపై పడి నీళ్లు ఇవ్వండని మొక్కారు. ఆ తర్వాత ఇరిగేషన్ ఎస్‌ఈ కేశవరావు ఒకరోజు సమయం ఇస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. కానీ బీజేపీ బీ ఆర్‌ఎస్ నాయకులు రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. అదేవిధంగా, నీటిని విడు దల చేయాలని వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచిం త మండలాల్లోని ఆయా గ్రామాల రైతులు వేలాదిగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆనకట్టపైకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆనకట్టపైకి చేరుకుం టుండగానే మధ్యలోనే ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు నిలి పివేశారు. రైతులు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.
జూరాలలో నీళ్లున్నా ఎందుకివ్వరు?
కాగా, జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు సాగునీరందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం వనపర్తి జిల్లా కేం ద్రంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. చేతులు జోడించి మొక్కుతున్నా... రైతులను ఆగం చేయొద్దు.. వారిని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి డి మాండ్ చేశారు. ఆయన విలేక రులతో మాట్లా డారు. బీఆర్‌ఎస్ నాయకుల అరె స్టును ఆయన ఖండించారు.
ఎక్కడికక్కడ నాయకుల అరెస్టు
సాగునీటి కోసం జూరాల ప్రాజెక్టుపై ధర్నాకు బీ ఆర్‌ఎస్ నాయకులు పిలుపునివ్వడంతో సోమవారం పోలీసులు అలర్ట్ అయ్యారు. తెల్లారే సరికి నాయకు లను హౌస్ అరెస్టు చేశారు. గద్వాల జిల్లాలో బాసు హనుమంతునాయుడు, బీఎస్ కేశవ్, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కుర్వపల్లయ్యతో పాటు మునిసిపల్ కౌన్సిలర్లను హౌస్ అరెస్టు చేసి ఇళ్లకే పరిమితం చేశారు. ప్రాజెక్టుపైకి రైతులు ఇతర నాయకులు రాకుండా పోలీసులు అన్నిదారుల్లో బారికేడ్లను పెట్టి కాపలా కాశారు. అయితే ధరూర్ మండల మాజీ జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర్‌రెడ్డి తన అనుచరులు, రైతులతో క లిసి జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు మొదట్లో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ వద్ద వారిని ప్రాజెక్టు మీదకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పద్మవెంకటేశ్వర్‌రెడ్డి రైతులతో కలిసి అక్కడే ధర్నాకు దిగారు. అదే విధంగా, వనపర్తి జిల్లా లో మాజీ మంత్రి సింగి రెడ్డి నిరంజన్‌రెడ్డి, మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్‌రెడ్డిలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకు న్నారు. నిరంజన్‌రెడ్డిని పాన్‌గల్ మండలం కొత్తపేట సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద సోమవారం ఉ దయం అదుపులోకి తీసుకుని వనపర్తిలోని ఆయన ని వాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచారు. రా మ్మోహన్‌రెడ్డి జూరాల ప్రాజెక్టు వద్ద నిరసనకు వెళ్తుం డగా సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కొ త్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ రత్నం, ఎస్ ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేందర్‌ల ఆధ్వర్యం లో మాజీ మంత్రి నివాసం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో బీఆర్ ఎస్ నాయకులు, రైతులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రి క్తత చోటు చేసుకుంది. అలాగే, ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డిని తిరుమలహిల్స్‌లోని ఆయన స్వగృహంలో పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు.