Share News

వందశాతం ఉత్తీర్ణత సాధనకు కృషి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:20 PM

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు.

వందశాతం ఉత్తీర్ణత సాధనకు కృషి

గట్టు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి వి ద్యార్థులతో మాట్లాడారు. విద్యలో సామర్థ్యాలను తెలుసుకున్నారు. అభ్యసన ప్రగతి, పాఠశాల విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించా రు. పదో తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణ త సాధించే దిశగా ఇప్పటి నుంచే కష్టపడాలని తెలిపారు. ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. స్ఫూర్తి యాక్షన్‌ ప్లాన్‌ను సమర్థవంతగా అమలు చేయాలని ఆ దేశించారు. ప్రతీ విద్యార్థిలో అవసరమైన అభ్య సన సామర్థ్యాలను పెంపొందిస్తూ నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలాచర్యలు తీసుకోవా లని తెలిపారు. ప్రతీ విద్యార్థి మార్కులను ఆన్‌ లైన్‌లో నమోదు చేయాలని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు నరసింహులుగౌడ్‌కు సూచించారు. అనంతరం గట్టు మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు విద్యాప్రమాణాల పెరుగుదల, వి ద్యార్థుల అభ్యసన ప్రగతి, పర్యవేక్షణకు సంబం ధించిన పలుసూచనలు చేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీ శ్రీధర్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:20 PM