నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:33 PM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీటీ రో డ్లకు రూ.320 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేట, మక్తల్ రహదారికి రూ. 237 కోట్లు, మరికల్, మినా్‌సపూర్, లింగంపల్లి రోడ్డుకు రూ.49.57 కోట్లు, ఆత్మకూరు, మరికల్ రోడ్డుకు రూ.22.07 కోట్లు, నల్లగట్టు, హిందుపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఏడాదిలో రహదారుల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పైలాన్ ఆవిష్కరణకు మంత్రులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం నారాయణపేట రోడ్డులోని గురుకుల పాఠశాల వద్ద నిర్వహించనున్న బహిరంగ స భను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్, కట్ట సురేష్ కుమార్‌గుప్తా, అమరేందర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రవి పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయంలో పూజలు
పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో రూ.25 లక్షలతో చేపడుతున్న షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
మక్తల్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎస్పీ నల్లపు లింగయ్య