ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:31 PM
రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవా రం వనపర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్య వైశ్యుల జిల్లా నూతన కార్యవర్గం, మండల కార్య వర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భం గా చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్య వైశ్యులకు మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తోందన్నా రు. నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభా కాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లా డుతూ ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో విశిష్ట పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్య మహిళ లకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోం దనడంలో వనపర్తి మునిసిపల్ చైర్‌పర్సన్ పదవి మాధవిరమేష్‌కు ఇవ్వడమే ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఆర్యవైశ్యుల ఐక్యత సమాజాని కి ఆదర్శమని, వారి సమస్యల పరిష్కారానికి తా ను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. కా ర్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు కలకొండ రమేశ్‌చంద్ర, మల్లి కార్జున్, మహిళ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సా మ్రాజ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు రమేశ్, మునిసిప ల్ చైర్‌పర్సన్ మాధవి, వనపర్తి వర్తక సంఘం అధ్యక్షుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.