Share News

పర్యావరణ రక్షణ, విద్యా ప్రగతికి కృషి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:43 PM

పర్యావరణ రక్షణ, విద్యా ప్రగ తికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

పర్యావరణ రక్షణ, విద్యా ప్రగతికి కృషి
నాటిన మొక్కలకు నీరు పోస్తున్న ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్‌ మమత, కార్పొరేటర్‌ లలిత

ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ రక్షణ, విద్యా ప్రగ తికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 5వ డివిజన్‌ ఎదిర ఊరచెరువు కట్టపై కార్పొరేటర్‌ లలిత ఆ ఽధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం, గ్రామ పెద్దలు, యువత సహకరంతో ఏర్పాటు చేసిన 40 బెంచీలను, ఐ లవ్‌ ఎదిర స్వాగత బోర్డును నగర మేయర్‌ మ మత, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ గ్రామపెద్దలు, యువత అభి వృద్ధికి సహకరించడం హర్ష ణీయమన్నారు. సామాజిక సేవలో ఎదిర పెద్దలు, యు వత ఎప్పుడూ ముందుటా రని, కార్పొరేటర్‌కు సహకరం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. పాఠశాల లో పదో తరగతి ఉత్తమ ఫ లితాలు సాధించడంపై ఉపా ధ్యాయ బృందాన్ని అభినందించారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సర్పంచులు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రూరల్‌ మండ లంలోని ఫత్తేపూర్‌ సర్పంచ్‌ అశోక్‌ యాదవ్‌, హన్వాడ మండల వేపూర్‌ సర్పంచు చెన్నయ్య, ముగ్గురు వార్డు సభ్యులు ఆదివారం ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మాచన్‌పల్లికి చెందిన పలువు రు కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషకరని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:43 PM