Share News

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:28 PM

రాజన్న సిరిసిల్ల వేములవాడలో 26 నుంచి 29 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివా రం పెబ్బేరులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు.

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు
కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

పెబ్బేరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల వేములవాడలో 26 నుంచి 29 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివా రం పెబ్బేరులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో జూని యర్స్‌ విభాగం నుంచి బాలురు 84మంది, సబ్‌ జూనియర్స్‌ విభాగం నుంచి బాలికలు 92మం దిని ఎంపిక చేశారు. కార్యక్రమానికి కొత్తకోట సీఐ ఓడీ రమేష్‌ హాజరై మాట్లాడారు. పోటీల లో తమ ప్రతిభను కనబరిచి గెలవాలని తెలి పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నర్సింహ గౌడ్‌, కురుమయ్య, తిరుపతయ్య, గోపాలం, మధు, సూరి, సంతోష, వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:28 PM