Share News

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:43 PM

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి
స్మృతివనం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ డీకే అరుణ, నాయకులు

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ - అభివృద్ధి పనుల ప్రారంభం

నారాయణపేటరూరల్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట నియోజకవర్గం లో సోమవారం ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బోయిన్‌పల్లిలో సీసీ రోడ్డు పనులను ప్రారంభిం చారు. సర్పంచ్‌ వెంకటేశ్‌ తన గౌరవ వేతనంతో కొనుగోలు చేసిన కంప్యూట ర్లను పాఠశాలకు ఎంపీ చేతుల మీదు గా అందించారు. కొల్లంపల్లి, పాతపల్లి గ్రామాల్లో హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా సంఘాల భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కె.రతంగ్‌పాండురెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, పగడాకుల శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, సత్యరఘుపాల్‌ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

ధన్వాడ (ఆంధ్రజ్యోతి) : గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎంపీ డీకే అరుణ అన్నారు. ధన్మాడ మండలం లోని మంత్రోనిపల్లిలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు, సీసీ రోడ్డు పనులను ఆమె సోమవారం ప్రా రంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రవి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సత్యయా దవ్‌, ఉపాధ్యక్షుడు ఉమేశ్‌కుమార్‌, వా ర్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

చిరస్థాయిగా నిలిచేలా ప్రాజెక్టు

నారాయణపేట న్యూటౌన్‌ (ఆంధ్రజ్యోతి) : ఛత్రపతి శివాజీ స్మృతివనాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిలే తీర్చిదిద్దాలని ఎంపీ డీ.కె.అరుణ సూచించారు. నిర్మాణ కమిటీ గౌరవాధ్యక్షుడు కుర్మన్న ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సోమవారం ఆమెను కలిసి ప్రాజెక్టు గురించి వివరించారు. నమూనా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు మహేశ్‌, ప్రధాన కార్యదర్శి శ్రీపాద కులకర్ణి, సభ్యులు వెంకటేశ్‌గౌడ్‌, పి.రఘు, అజయ్‌, గోపీ కృష్ణ, నవీన్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌ కేశవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:43 PM