రెండో ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బంది కేటాయింపు
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:00 PM
మునిసిపల్ ఎన్నికల కౌం టింగ్ కోసం రెండవ ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపున పూర్తి చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు.
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల కౌం టింగ్ కోసం రెండవ ర్యాండమైజేషన్ ద్వారా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపున పూర్తి చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. గురువారం ఐడీవో సీ కలెక్టర్ ఛాంబర్‌లో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మునిసిపాలిటీల్లో మొత్తం 76 కౌంటింగ్ టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈకౌంటింగ్ కేం ద్రాల్లో విధులు నిర్వహించేందుకు 76 మంది సూపర్‌వైజర్లు, 152 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కలిపి మొత్తం 228 మంది సిబ్బందిని రెండో ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ అధికారుల కేటాయింపులో పూర్తి పారదర్శకతను పాటిస్తూ ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్ ద్వారా అన్‌లైన్‌లో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించినట్లు వెల్లడించారు. జిల్లాలో మునిసిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎన్నికల సిబ్బంది రమేశ్ ఉన్నారు.