Share News

పేరుకే క్రీడా ప్రాంగణాలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:38 PM

గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది.

పేరుకే క్రీడా ప్రాంగణాలు
దేవరకద్రలో నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణం

- కనిపించని స్పోర్ట్స్‌ కిట్లు

- నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

దేవరకద్ర, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రీడా ప్రాంగణాలు అనుకున్న మేర ఉపయోగపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో యువత సెల్‌ ఫోన్లతో బిజీబిజీగా గడుపుతూ సమయం వృథా చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళ యువకులు క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడేందుకు క్రీడా సామగ్రి అందజేసి ప్రోత్సహించాల్సి ఉన్నప్పటికీ అవి అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా ప్రాంగణాలను పట్టించుకోకపోవడంతో చెత్తచెదారంతో నిండి అసౌకర్యంగా మారాయి. కీడ్రా ప్రాంగణంలో ఎలాంటి సౌక్యరాలు లేకపోవడంతో వెళ్లడం లేదని క్రీడాకారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా వస్తువులు కొనుగోలు చేసి క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:38 PM