ఆధ్యాత్మికతను పెంపొందించాలి
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:37 PM
అడ్డాకుల మండల కేంద్రంలో దాతలు సహకారంతో జామీయా మసీద్ ఏ ఖదీర్ (ఖదీర్‌సాబే రా) మజీద్‌ను నిర్మాణం చేశారు.
మూసాపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : అడ్డాకుల మండల కేంద్రంలో దాతలు సహకారంతో జామీయా మసీద్ ఏ ఖదీర్ (ఖదీర్‌సాబే రా) మజీద్‌ను నిర్మాణం చేశారు. ఈ మజీద్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డితో పాటు ముస్లిం మతగురువులు హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లాహు మార్గంలో ఎవ్వరైన సహకారం అందిస్తే వారికి తప్పకుండా సన్మార్గాలు లభిస్తాయని, ఇస్లాం మత నియమాలు, ప్రతిరోజు ఐదు పూటల నమాజ్ చదువాలని, ప్రవిత ఖురాన్ పఠనం చేయాల ని, సత్ప్రవర్తన, సత్యం, అహింస, శాంతి ధర్మమార్గాలను పాటించాలని, సమాజం లోని పేదలు, అనాథలు, ది క్కులేని వారితో పాటు సాటి మానవులకు తమవంతు సహకారం అందించాలని, భక్తి ఆధ్యాత్మికతను పెంపొందిం చాలన్నారు. అనంతరం దాత లు, మైనార్టీ నాయకులు, మత పెద్దలను మాజీ జడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి అభినందించి, సన్మానించారు. మజీద్ కమిటీ అధ్యక్షుడు ఖాజాగోరి, మతగురు ప్రభోదకులు హజ్రత్ ముఫ్తి మహ్మద్ అన్వర్, దాతలు మొహరత్మ సాబేరాబేగం, ఇమామ్ షాకీర్, మౌజం అప్సర్, బీఆర్‌ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, చంద్రమో హన్‌రెడ్డి, రమేష్, సాయిసాగర్, రంగన్నగౌడ్, కృష్ణయ్య, మహేష్‌యాదవ్, బాలరాజు, శ్రీనివా సులు, వెంకటేష్, రాములు పాల్గొన్నారు.