వనపర్తిలో ఆధ్యాత్మిక వైభవం
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:44 PM
లోక క్షేమం కోసమే విశ్వశాంతి మహాయాగమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు.
- లోక కల్యాణం కోసం విశ్వశాంతి మహాయాగం
- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి
వనపర్తి టౌన్/వనపర్తి రూరల్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): లోక క్షేమం కోసమే విశ్వశాంతి మహాయాగమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కృష్ణజ్యోతి స్వరూపా నంద స్వామీజీ సంకల్పంతో వనపర్తి పట్టణంలో 15 రోజులుగా జరుగు తున్న విశ్వశాంతి మహాయాగానికి ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాగశాలలో మంత్రోచ్ఛరణలు, హోమాగ్ని పరిమ ళాలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నదని అన్నారు. ఈ మహాయాగం ఎంతో పవిత్రమైనదని, యాగం విజయవంతంగా కొనసాగా లని, స్వామీజీ వారి సంకల్పం నెరవేరి జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరు పతయ్య, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, ఓబీసీ నాయకులు నందిమల్ల చంద్రమౌళి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.