Share News

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:38 PM

దేవరకద్ర నియోజకవ ర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్ర త్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు.

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

కొత్తకోట, అక్టోబరు 4 (ఆంధ్ర జ్యోతి) : దేవరకద్ర నియోజకవ ర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్ర త్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నా రు. ఆదివారం వనపర్తి జిల్లా కొత్త కోట మండంలోని కనిమెట్ట గ్రా మంలో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలను ప్రారంభించారు. రూ.10 లక్షలతో అంగన్‌వాడీ భవ నం, రూ. 12 లక్షలతో మహిళా సంఘం భవన నిర్మాణాలకు భూ మిపూజ చేశారు. అనంతరం జరి గిన సభలో ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామాలలో అంతర్గాత రోడ్ల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిం చారు. శంకర సముద్ర కుడి కా లువ ఆయకట్టుకు సాగునీరు అం దాలంటే కానాయపల్లి నిర్వాసితు లను ఖాళీ చేయించాలని, అందు కోసం రూ. 7.5 కోట్లు మంజూ రైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామచంద్రయ్య యాదవ్‌, సీడీసీ చంద్రమోహన్‌రెడ్డి, ప్రశాం త్‌, బీచుపల్లి, కరుణాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:38 PM