Share News

ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:43 PM

మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి, ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించాలని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా సూచించారు.

ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

- మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించి, ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించాలని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ ఖుష్బూగుప్తా సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారులు బుధవారం గ్రామాల్లో పర్యటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కార్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని, తమ శాఖలకు సంబంధించిన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించాలని ఆదేశించారు. రానున్న వేసవిలో తాగునీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖల్లో ఉన్న బ్యాక్‌లాగ్‌ ఖాళీల వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రతీ శాఖలో మంజూరైన పోస్టులు, ఖాళీ పోస్టులు, రోస్టర్‌ వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్‌, జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్‌వో నిర్మల, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీవో నర్సింహులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:43 PM