జలసంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:08 PM
ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వీ బీజీ రామ్‌జీ పథకంలో జలసంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ న ర్సింగరావు అన్నారు.
గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ పథకం పనులను గుర్తించాలి
కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలి
అదనపు కలెక్టర్ నర్సింగ రావు
గద్వాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తున్నందున వీ బీజీ రామ్‌జీ పథకంలో జలసంరక్షణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ న ర్సింగరావు అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐడీవోసీ సమావేశ మందిరంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై అలంపూర్ నియోజకవ ర్గం సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శు లు, ఇతర అధికారులకు నిర్వహించిన శిక్షణ కా ర్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హా జరై ప్రసగించారు. వీబీజీ రామ్‌జీ పథకంలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, అంగన్‌వాడీ, గ్రామైక్య సంఘాలు, పశువుల షెడ్లు తదితర అ వసమైన నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు చే యవచ్చన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఇంకుడుగుంతలు, పంట కుంట నిర్మా ణం చేపడుతున్నప్పటికీ వందశాతం ఫలితాలు రావాలంటే ప్రతిఒక్క ఇంటితో పాటు ప్రతి రైతు పొలాల్లో వీటిని నిర్మించుకునేలా పెద్దఎత్తున అ వగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వీబీ జీ రామ్‌జీ పథకంలో చేపట్టాల్సిన వివిధ పను లపై పకడ్బందీ ప్రణాళిక రూపొందించి, అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో చర్చించి ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. ఎంపీడీవోలు, ఎంపీ వోలు సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ఈ నెల 25న తమ మండలాల్లో ఏదైనా ఒక గ్రా మంలో పర్యటించి శిక్షణలో తెలుసుకున్న విష యాలను చర్చించి వీబీజీ రామ్‌జీ పథకంలో చే పట్టాల్సిన పనులపై చర్చించాలన్నారు. 28నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అన్నిగ్రామాల్లో చేపట్టా ల్సిన పనులన్నింటినీ గుర్తించి గ్రామసభ ఆమో దం తీసుకోవాలని సూచించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్‌జీ పథ కం ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే గ్రామా ల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి కల్పించేం దుకు వీబీజీ రామ్‌జీ పథకం ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంద రూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సమావేశం లో డీఆర్డీవో ముషాహిదా బేగం, డీపీవో శ్రీకాం త్, డీఏవో వీరప్ప, అధికారులు పాల్గొన్నారు.