గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:39 PM
గ్రామాల అభివృద్ధిపై తనవంతుగా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గట్టు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిపై తనవంతుగా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గొర్లఖాన్‌దొ డ్డి గ్రామంలో పలుఅభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి 20 లక్షల రూపాయ లతో మహిళా సమాఖ్య భవనం, డ్రైనేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహిళలు ఆర్థి కంగా ఎదగాలని, ప్రతీ మహిళ మహిళాసం ఘంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. గ్రా మాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పం చ్ శేకమ్మ, గ్రంఽథాలయ మాజీ చైర్మన్ జంబురామన్‌గౌడ, డీపీవో శ్రీకాంత్, ఇన్‌చార్జి ఎంపీడీవో ఖాజమైనొద్దిన్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్య క్షుడు రాజశేఖర్, సిద్ధు పాల్గొన్నారు.