నడిగడ్డలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:27 PM
రాష్ట్రంలో అక్షరాస్యత శాతంలో గద్వాల ఎంతో వెనుక బడి ఉండేదని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి నడిగడ్డ ప్రాంతంలో విద్యారం గంపై ప్రత్యేక దృష్టి సారించానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
త్వరలో కేటిదొడ్డిలో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభం
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ధరూరు, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అక్షరాస్యత శాతంలో గద్వాల ఎంతో వెనుక బడి ఉండేదని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి నడిగడ్డ ప్రాంతంలో విద్యారం గంపై ప్రత్యేక దృష్టి సారించానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే జోగుళాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో యంగ్ ఇండియా స్కూల్ ప్రా రంభించనున్నట్లు తెలిపారు. బుధవారం ధరూ ర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల డి గ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే నూతన విద్యార్థులకు స్వాగత కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో మెలుగుతూ ఉ న్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పదోతరగతి వరకు చదవి పై తరగతులకు వెళ్లకుండా విద్యను మ ధ్యలోనే ఆపేవారని, దీంతో తల్లిదండ్రులు వారికి వివాహం చేసి పంపేవారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆడపిల్లలను విద్యావంతు లుగా తీ ర్చిదిద్దే లక్ష్యంలో ఉన్నత చదువులు చది వించా లని ధరూర్ మండలంలో జూనియర్ బా లికల కళాశాల, పూలే గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పా టుకు కృషి చేశానని తెలిపారు. గద్వాలలో ఎం బీఏ, బీబీఏ,ఎల్‌ఎల్‌బీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స ర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచు డీఆర్ విజయ్‌కుమార్ జిల్లా సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణనాయుడు, నాయకులు రంగస్వామి, కర్రెప్ప, సంజీవ్, కళాశాల ప్రిన్సిపా ల్ హుసేనప్ప, అధ్యాపకులు ఉన్నారు.