Share News

విద్య, సాగునీరుపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:38 PM

ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

విద్య, సాగునీరుపై ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైటీసీ బిల్డింగ్‌లో ఐఐఐటీ కోసం పదోతరగతి విద్యార్థులకు 45 రోజల పాటు మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌, వందేమాతరం ఫౌండేషన్‌ ఆఽధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు అంటే కేవలం శ్రామిక జిల్లా కాదని, ఎ న్నో అన్యాయాలు, దగా, మోసాలకు గురైన జిల్లా అని అన్నారు. ఉద్యమంలో పాలమూరుకు జరిగిన అన్యాయం గురించి చెప్పి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటు అయ్యాక కూడా పాలమూరుకు న్యాయం జరుగలేదన్నారు. పాలమూరును విద్యలో ముం దుంచేందుకు మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ ఏర్పాటు చేసి, విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధిచాలన్నారు. ఐఐఐటీ లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల 150 మంది విద్యార్థులు శిక్షణ పొందారన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చూపిన మార్గంలో యువత ముందుకు సాగితే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం మేయర్‌ మమత, డిప్యుటీ మేయర్‌ మారేపల్లి సురేందర్‌రెడ్డి, డీఈఓ ప్రవీణకుమార్‌, ఐఐఐటీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రావణ్‌కుమార్‌, వందేమాతరం ఫౌండేషన్‌ కోఆర్టీనేటర్‌ రవీందర్‌రెడ్డి మాట్లాడారు.

Updated Date - Mar 11 , 2026 | 11:38 PM