Share News

విద్యుత్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:40 PM

గణపతి ఉ త్సవాలకు ఆటంకం ఉండరాదని ఆదివారం విద్యుత్‌శాఖ ప ట్టణంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది.

విద్యుత్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌

పాలమూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : గణపతి ఉ త్సవాలకు ఆటంకం ఉండరాదని ఆదివారం విద్యుత్‌శాఖ ప ట్టణంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించింది. రాంమందిర్‌ చౌరస్తా నుంచి పాన్‌చౌరస్తా వరకు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పాత పోల్స్‌ను తొలగించి, పొడవైన పోల్స్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సిబ్బం ది ఏడీఈ తౌర్యానాయక్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోల్స్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్‌ లైన్‌ రోడ్డుపైన అడ్డంగా ఉండటంతో ప్రతీ ఏడాది గణపతులను తీసుకువెళ్లటం, నిమజ్జనానికి వెళ్లే టప్పుడు వైర్లను తీసి మరోసారి బిగించటం వ్యయప్రయా సలు ఎదురయ్యేవి. కాగా గణపతుల నిమజ్జనానికి వెళ్లేట ప్పుడు ఆటంకం లేకుండా లైన్‌ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు.

ప్రతీ ఏడాది ఇబ్బంది ఉండరాదని..

ప్రతీ ఏడాది రోడ్డుకు అవతల ఉన్న విద్యుత్‌ తీగలతో గణ పతుల విగ్రహాలు తీసుకెళ్లడానికి ఆటంకం ఏర్పడేది. వైర్లను తీసి గణపతి విగ్రహాలు వెళ్లాక.. బిగించటం పెద్ద సమస్యగా ఉండేది. రోడ్డుకు ఇరువైపులా వైర్లను బిగించటం, కనెక్షన్‌ ఏదానికి అక్కడే ఉండటంతో ఎలాంటి ఆటంకం ఉండదు.

- తౌర్యానాయక్‌, ఈడీఈ, పట్టణ ఏడీఈ

Updated Date - Sep 13 , 2026 | 11:40 PM