ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:22 PM
ప్రతీ గ్రామ సమాఖ్యలో కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక సంఘాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతీ ఒక్కరిని సభ్యులుగా చేర్చాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ ఖుష్బూగుప్తా
మహబూబ్‌నగర్ కలెక్టర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ గ్రామ సమాఖ్యలో కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక సంఘాలను 15 రోజుల్లో ఏర్పాటు చేసి, అర్హులైన ప్రతీ ఒక్కరిని సభ్యులుగా చేర్చాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో సోషల్ మొబలైజేషన్ మీద అధికారులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. జిల్లాలో 460 గ్రామ సమైఖ్యలు ఉన్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి, ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ప్రతీ ఒక్క మహిళను మహిళా సంఘాల్లో చేర్చాలని, నిర్ణీత గడువులో సంఘాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, డీఆర్డీవో నరసింహులు, జిల్లా వ్యవసాయాధికారి గోవిందునాయక్, డీసీవో కృష్ణ పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని దివిటిపల్లి అమర రాజా అడ్వాన్స్ సెల్ టెక్నాలజీస్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రాంభించనున్నారు. మంగళవారం పరిశ్రమను సందర్శించి పర్యటన ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులు, కంపెనీ ప్రతినిధులకు ఆదేశించారు. ఎస్పీ జానకి, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
శ్రీనిధి రుణాల రికవరీ వేగవంతం చేయాలి
శ్రీనిధి రుణాల రికవరీ వేగవంతం చేసి పెండింగ్ కేసులు పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనిధి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీనిధి వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలు, రుణాల పంపిణీ, రికవరీ, డిఫాల్ట్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, డీఆర్డీవో నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్, డీసీవో కృష్ణ, శ్రీనిధి రీజినల్ మేనేజర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.