దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనం
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:39 PM
గద్వాల జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ది వ్యాంగులకై ప్రత్యేకంగా భవ నం ఏర్పాటు చేయడం చేసిన ట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
- ఆసుపత్రిలో సదరం కేంద్రం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): గద్వాల జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ది వ్యాంగులకై ప్రత్యేకంగా భవ నం ఏర్పాటు చేయడం చేసిన ట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం గద్వాలలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో 16.90 లక్షల వ్య యంతో నిర్మాణం చేసిన సదరం కేంద్రం విభాగం ప్రత్యేక భవనాన్ని ఎమ్మెల్యే ప్రా రంభించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ... నూతనంగా ఏర్పా టు చేసిన ఈ భవనంలో దివ్యాంగులు సదరం నిర్వహించేటప్పుడు వెయిటింగ్ చేయడానికి హాలు అన్ని రకాల సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్స్ నమోదు చేయాలని, ని జమైన దివ్యాంగులకు సర్టిఫికెట్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అద నపు కలెక్టర్ నర్సింగరావు, మునిసిపల్ చై ర్‌పర్సన్ జయలక్ష్మియాదవ్, ఆసుపత్రి సూ పరింటెండెంట్ ఝాన్సిలక్ష్మి, డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి, వైస్‌చైర్మన్ శంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రామన్‌గౌడ్, జి ల్లా సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బాబర్, నాగులుయాదవ్, రామలింగేశ్వర్ కాంళే తదితరులు ఉన్నారు.