Share News

మందలించాడని.. తండ్రిని చంపిన తనయుడు

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:24 PM

కన్న కొడుకు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో తండ్రి మంద లించాడు. దీంతో ఆగ్రహానికి గురై ఆ కొడుకు తండ్రిని రాయితో కట్ట డంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

మందలించాడని.. తండ్రిని చంపిన తనయుడు

నవాబ్‌పేట, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కన్న కొడుకు మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో తండ్రి మంద లించాడు. దీంతో ఆగ్రహానికి గురై ఆ కొడుకు తండ్రిని రాయితో కట్ట డంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా, నవాబ్‌పేట మండలంలోని దేపల్లి గ్రా మంలో జరిగింది. గ్రామానికి చెందిన రాపోలు రాములు(56)కు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్‌ షాద్‌నగర్‌ పట్టణంలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్న కుమారుడు సురేందర్‌ ఊ ర్లోనే ఉంటూ మద్యం తాగుతూ, జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో ఈనెల 26న రాత్రి ఇంటి ముందు తండ్రి రాములు అతడిని మం దలించాడు. ఇలా తాగి తిరగడమేమిటని, ఏదైనా పని చేసుకోవాలని సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన సురేందర్‌ తండ్రితో గొడవ పెట్టుకుని రాయితో తలపై మో దాడు. తీవ్ర గాయమై రక్తమోడుతున్న అతడిని చుట్టుపక్కల వారు వారిస్తున్నా వినకుండా ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. అప్పటికే అతడు మృతి చెందాడు. ఆ తర్వాత సురేందర్‌ అన్న శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి, తాను తండ్రిని చంపేసినట్లు చెప్పా డు. దీంతో అతడు హుటాహుటిన గ్రామానికి చేరుకొని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

Updated Date - Sep 27 , 2026 | 11:24 PM