సైన్స్ ద్వారానే సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:05 PM
సైన్స్ ద్వారానే అన్ని సమ స్యలకు పరిష్కారం దొరుకుతుందని ఏఎంవో దుంకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : సైన్స్ ద్వారానే అన్ని సమ స్యలకు పరిష్కారం దొరుకుతుందని ఏఎంవో దుంకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్‌లో డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సహ కారంతో నిర్వహించిన సైన్స్ టాలెంట్ కాంపిటే షన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. విద్యార్థులు నేటి సమాజంలో పోటీ తత్వానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నా రు. దేశం గర్వించ దగ్గ గొప్ప వ్యక్తుల్లో ఒకరైన అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా గుర్తింపు పొందార న్నారు. డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ వ్వవస్థాపక కా ర్యదర్శి శివకుమార్, కలాం ల్యాబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు టీఎన్ శ్రీధర్, అధ్యక్షుడు జానార్దన్ మాట్లాడారు. ఈ టాలెంట్ టెస్టుకు 43 పాఠశా లకు చెందిన 321 మంది విద్యార్థులు పాల్గొన్నా రు. కార్యక్రమంలో కలాం ల్యాబ్ ఉపాఽధ్యక్షుడు శ్రీనివాస్, ఆంజనేయులు, శోభారాణి, శ్రీనివాస్, బాలరాజ, గోపాలం, నర్సప్ప, అనురాధ, చక్ర వర్తిగౌడ్ పాల్గొన్నారు.