ఘనంగా గణనాథుల నిమజ్జనం
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:37 PM
: మ క్తల్ పట్టణంలో 11 రోజులపాటు పూజలందుకున్న గణనాథులను శుక్రవారం భక్తిశ్రద్ధలతో స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు
- మక్తల్‌లో ఊరేగింపుగా తరలిన లంబోదరుడు
- పటిష్టంగా పోలీసు బందోబస్తు
- పర్యవేక్షించిన ఎస్పీ
మక్తల్/మక్తల్ రూరల్/ నారాయణపేట క్రైం, సెప్టెం బరు 25 (ఆంధ్రజ్యోతి): మ క్తల్ పట్టణంలో 11 రోజులపాటు పూజలందుకున్న గణనాథులను శుక్రవారం భక్తిశ్రద్ధలతో స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. ప ట్టణంలో 50కి పైగా ఉన్న విగ్రహాలను ఆయా మండపాల నుంచి ఊరేగింపుగా తరలించారు. భజనలు, కోలాటం, దాండియా నృత్యాలతో అల రించారు. వీహెచ్‌పీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో ఆజాద్‌నగర్ చౌరస్తాలో స్వాగతవేదిక ఏర్పాటు చేశారు. బాలగంగాధర్ చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ప్రతీ మండపం నిర్వాహకులను వీహెచ్‌పీ నాయకులు శాలువా, మెమెంటోతో సత్కరించారు. హాజరైన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు నిర్వహించాలన్నారు. పెద్ద చెరువు వద్ద క్రెయిన్ సహాయంతో గణనాథులను నిమజ్జనం చేశారు. అంతకుముందు ఆయా మండ పాల వద్ద లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో సీసీ కెమెరాల ని ఘా, వీడియో రికార్డింగ్ చేపట్టారు. డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, ఎస్‌ఐ పి.రాజు ఆధ్వర్యం లో 150మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందో బస్తు నిర్వహించారు. అంతకుముందు బందోబ స్తు విధులకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బందికి ఎస్పీ డాక్టర్ వినీత్ మక్తల్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో సమావేశం నిర్వ హించి, భద్రతా సూచనలు చేశారు. అనంతరం మక్తల్ మినీ ట్యాంక్ బండ్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నారాయణపేటలో ఎస్పీ డ్రోన్ ద్వారా శోభా యాత్రను పరిశీలించి, కమ్యూనికేషన్ వ్యవస్థ (మ్యాన్‌ప్యాక్) ద్వారా ప్రార్థనా మందిరాలు, చౌరస్తా, నిమజ్జన ప్రదేశంలో బందోబస్తులో ఉన్న సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు.