సరదాగా ఈతకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:40 PM
సంతోషంతో సర దాగా ఈతకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యో గి మృతి చెందిన సంఘటన వన పర్తి మండల పరిధిలోని చిన్నగుం టపల్లి గ్రామంలో ఆదివారం చో టు చేసుకుంది.
- వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామంలో ఘటన
వనపర్తి రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : సంతోషంతో సర దాగా ఈతకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యో గి మృతి చెందిన సంఘటన వన పర్తి మండల పరిధిలోని చిన్నగుం టపల్లి గ్రామంలో ఆదివారం చో టు చేసుకుంది. కుటుంబ సభ్యుల మేరకు అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు, సునీతల దంపతు లకు ఇద్దరు కుమారులు. పెద్దకు మారుడు నరేష్(25), చిన్న కుమా రుడు రాకేష్‌లు ఉన్నారు. పెద్దకుమారుడు నరేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పని చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం సొంత పని నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. శనివారం సాయంత్రం సరదాగా గ్రామ శివారులో గుండ్ల చెరువు దగ్గరికి తన తమ్మునితో కలిసి సరదాగా చేపలుపడుతూ ఈత కొట్టారు. అదే సమయంలో ఈదురుగాలులతో పాటు వర్షం కురిసిం ది. ఆ వర్షానికి చెరువులో వస్తున్న అలల తాకిడికి ఈత కొడుతున్న నరేష్ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన తమ్ముడు గ్రామస్థులకు, కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి గ్రామ శివారులో గల గుండ్ల చెరువు వద్దకు వెళ్లారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వర్షం నిరంత రం కురుస్తుండడంతో నరేష్ ఆదివారం మళ్లీ గాలింపు చర్యలు ప్రారం భించి నరేష్ మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీశారు. నరేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.