ఆదర్శ వివాహాలు పెరిగితేనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:27 PM
సమాజంలో ఆదర్శ వి వాహాలు పెరగటంతోనే అభివృద్ధి చెందుతుందని ఉస్మానియా యూని వర్సిటీ ప్రిన్సిపాల్ కాశీం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆదర్శ వివాహంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
పాలమూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో ఆదర్శ వి వాహాలు పెరగటంతోనే అభివృద్ధి చెందుతుందని ఉస్మానియా యూని వర్సిటీ ప్రిన్సిపాల్ కాశీం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఆదర్శ వివాహంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కె.ప్రవీణ్‌కుమార్, బి.స్వప్న ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకోవటం మంచి విషయమన్నారు. జ్యోతిరావు ఫూలే ఆదర్శంతో నేటి సమాజంలో కుల, మతాలకతీతంగా సమాజంలో ఆదర్శ వివాహా లు జరగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కుల, మత విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న యువత జ్యోతిరావు ఫూలే ఆదర్శంతో ముందుకురావాలన్నారు. టీపీటీ ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వివాహం జరిపించారు. కార్యక్రమంలో రాం చందర్, యం.కృష్ణ, బి.రాము, ఎస్.ఎల్ పద్మ, పీవోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షు రాలు డి.స్వరూప, రాంచందర్, హన్మేష్, కార్పొరేటర్ ప్రవీణ్‌కుమార్, లక్ష్మి, వెంకన్న, కేశవులు, శ్రీను, నరసింహులు పాల్గొన్నారు.