Share News

సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టు

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:09 PM

సమాజ సృష్టికర్త అయిన స్త్రీలపై వివక్ష, సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటిది.

సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టు
మాట్లాడుతున్న ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి

- ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి

పాలమూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : సమాజ సృష్టికర్త అయిన స్త్రీలపై వివక్ష, సామాజిక అణచివేత స్త్రీల అస్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటిది. మహిళల భద్రత చట్టాలకే పరిమితమా? అని ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవనం (గీత ముఖర్జి ప్రాంగణం)లో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా 12వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజనతో కలిసి ఆమె మహాసభలకు హాజరై మాట్లాడారు. మహిళల రిజర్వేషన్లపై కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, తరాల నుంచి మహిళలు అణచివేత, లింగవివక్షకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రకాల పోరాటాల ఫలితంగా మహిళలకు పాలకులు కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ.. వాటిని పకడ్బందీగా అమలు చేయకుండా చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, వైద్యం, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భార్గవి, పద్మావతి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, గాయని శ్యామల, ఇందిర, కృష్ణవేణి, గౌని గీత, శ్రీదేవి, శ్రీవిద్య, పుష్ఫ, వరలక్ష్మి, పద్మ, బాలమణి, మాధవి, అంజమ్మ, సుగుణ, నాగమ్మ, దివ్య, సంధ్య, నాగమణి, సునీత, అరుణ, సురేష్‌, రాము, లక్ష్మణ్‌, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌, కార్తీక్‌, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:09 PM