శివుని ఆశీస్సులతో సజావుగా అభివృద్ధి
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:45 PM
ఆ ధ్యాత్మిక చింతన, భక్తిభావం ఉండటం వల్ల అ భివృద్ధి మరింత పరుగులు పెడుతుందని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఆలయ నిర్మాణానికి భూమిపూజ
గద్వాలటౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఆ ధ్యాత్మిక చింతన, భక్తిభావం ఉండటం వల్ల అ భివృద్ధి మరింత పరుగులు పెడుతుందని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలోని రెవెన్యూకాలనీలో కొత్తగా నిర్మించ తలపెట్టి భీమలింగేశ్వర ఆలయ నిర్మా ణ పనులకు మునిసిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే దంపతులు ఆదివా రం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శివ లింగానికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే దంపతు లు ఆలయ నిర్మాణం సజావుగా, సకాలంలో శివుడి ఆశీస్సులతో సాగాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణాన్ని పరస్పర సహకార సహకా రంతో, అన్నివర్గాల ప్రజల తోడ్పాటుతో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆల య కమిటీ అధ్యక్షుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి, కౌ న్సిలర్లు వేదవతి, రామలింగేశ్వర కాంళ్లే, చంద్రశే ఖర్, నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, సత్యారెడ్డి, మాజీఎంపీపీ విజయ్, పీ ఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, సర్పంచు శివ, ముర ళి, శ్రీను ముదిరాజ్, ఆలూరు రామయ్య శెట్టి, ప్రభాకర్ గౌడ్, లక్ష్మన్న, నాగశంకర్ ఉన్నారు.