ఇంటర్ ఫలితాల్లో కాస్త మెరుగు
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:30 PM
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు గతంకంటే కస్త ఫరవాలేదనిపించాయి. ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సారి బాలికలే పై చేయి సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి ఏడాది ఫలితాల్లో మహబూబ్‌నగర్ 62.19 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది.
ఉమ్మడి జిల్లాలో మొదటి సంవత్సరంలో మహబూబ్‌నగర్ ఫస్ట్
ద్వితీయ సంవత్సరంలో జోగుళాంబ గద్వాల ముందంజ
మహబూబ్‌నగర్ విద్యావిభాగం ఏఫ్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు గతంకంటే కస్త ఫరవాలేదనిపించాయి. ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఈ సారి బాలికలే పై చేయి సాధించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి ఏడాది ఫలితాల్లో మహబూబ్‌నగర్ 62.19 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 8,982 మంది విద్యార్థులకు గాను 5,586 మంది పాస్ అయ్యారు. రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉమ్మడి జిల్లాలో రెండవ స్థానంలో నిలువగా, రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. 3,482 మందికి విద్యార్థులకు గాను 2,161 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వనపర్తి జిల్లా ఉమ్మడి జిల్లాలో మూడో స్థానంలో, రాష్ట్ర వ్యాప్తంగా 23వ స్థానంలో నిలిచింది. 4,949 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,884 మంది పాసయ్యారు. 58.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేట ఉమ్మడి జిల్లాలో నాల్గో స్థానంలో, రాష్ట్రంలో 26వ స్థానంలో నిలిచింది. 3,893 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,188 మంది ఉత్తీర్ణత సాఽధించారు. నాగర్‌కర్నూల్ ఉమ్మడి జిల్లాలో చివరి స్థానంలో, రాష్ట్రంలో 27వ స్థానంలో నిలిచింది. 5,353 మంది విద్యార్థులకు 2,987 మంది ఉత్తీర్ణత సాధించారు. 55.80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా 73.01 శాతంతో ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో. రాష్ట్రంలో 14వ స్థానంలో నిలించింది. 2,994 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,186 మంది పాస్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా 72.65 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి జిల్లాలో రెండో స్థానంలో, రాష్ట్రంలో 17 స్థానంలో నిలిచింది. 8,116 మంది పరీక్షలకు హారుకాగా, 5,896 మంది పాస్ అయ్యారు. వనపర్తి జిల్లా 70.99 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి జిల్లాలో మూడో స్థానంలో, రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. 4,616 మంది పరీక్ష రాయగా, 3,277 మంది పాస్ అయ్యారు. నారాయణపేట జిల్లా 69.90 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి జిల్లాలో నాలుగు, రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది. 3,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 2,254 మంది పాస్ అయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా 66.27 శాతం ఉత్తీర్ణత సాధించి, ఉమ్మడి జిల్లాలో చివరి స్థానం, రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. 4,500 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,982 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.