Share News

ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , Publish Date - May 19 , 2026 | 11:38 PM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ఆరు గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యు లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

- బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ముఠా

- నిందితులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారే

- 10 తులాల బంగారు వస్తువులు, కారు స్వాధీనం

- వివరాలు వెల్లడించిన మహబూబ్‌నగర్‌ డీఎస్పీ

జడ్చర్ల, మే 19 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ఆరు గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యు లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడిం చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిం చారు. జడ్చర్ల కొత్తబస్టాండు సమీపంలో వాహ నాల తనిఖీ చేపడుతుండగా హర్యానా రాష్ట్రానికి చెందిన ఆరుగురు పట్టుబడ్డారని తెలిపారు. బస్టాండ్లలో విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లే వారిని టార్గెట్‌ చేసి, వారు ఎక్కిన బస్సులో ఎక్కి చోరీలకు పాల్పడతారని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 7న జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో ఓ మహిళ పండ్లు కొనుక్కొని బస్సెక్కింది. ఆమెను వెంబడించిన ముఠాలోని సభ్యులు అదే బస్సులోకి ఎక్కి, ఆమె దృష్టిని మరల్చి దాదాపు 6 తులాల బంగారు వస్తువుల చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ నెల 18న జడ్చర్ల బస్టాండుకు ఆటోలో వచ్చిన ప్రయాణికు లను వెంబడించి బస్సెక్కి దృష్టి మరల్చి దాదా పు 4 తులాల బంగారు వస్తువుల చోరీకి పాల్ప డ్డారన్నారు. చోరీకి పాల్పడిన అనంతరం వీరం తా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌కు పారిపో యారని, ఓ లాడ్జిలో తలదాచుకున్నారని, మంగ ళవారం మళ్లీ జడ్చర్లలో దొంగతనానికి కారులో రాగా, అదే సమయంలో జడ్చర్ల ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపడుతుం డగా అనుమానాస్పదంగా కనిపించడంతో వారి ని విచారించారని తెలిపారు. దీంతో జడ్చర్లలో చేసిన చోరీల వివరాలు వెలుగులోకి వచ్చాయని, పట్టుబడిన వారిలో హర్యానా రాష్ట్రం భివానీ ప్రాంతానికి సందీప్‌ అనే వ్యక్తి ముఠా నాయకు డుగా ఉన్నాడని, 2017 నుంచి 2019 మధ్య కాలంలో ఆదిలాబాద్‌, విశాఖపట్నం, హైదరాబా ద్‌ తదితర ప్రాంతాలలో 15 దొంగతనం కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. వరుసకు తమ్ముడైన అశోక్‌తో పాటు హర్యానాకు చెందిన ప్రవీణ్‌, రాజేష్‌, సునీల్‌ కుమార్‌, సచిన్‌లతో కలిసి దొంగతనాలకు పాల్ప డ్డారన్నారు. వారి వద్ద నుంచి 10 తులాల బంగారు వస్తువులతో పాటు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెంక టేశ్వర్లు వివరించారు. ఈ కేసులో అత్యంత చాక చక్యంగా విధులు నిర్వహించిన ఎస్‌ఐ మల్లేష్‌, కానిస్టేబుల్‌ విష్ణు, నరసింహరాజులను ఎస్పీ అభినందించారని, రివార్డు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్చర్ల సీఐ కమ లాకర్‌, ఎస్‌ఐ మల్లేష్‌, కానిస్టేబుళ్లు విష్ణు, నరసింహరాజు, శంకర్‌లున్నారు.

Updated Date - May 19 , 2026 | 11:38 PM